Google ఇన్‌పుట్ సాధనాల Chrome పొడిగింపు

Google ఇన్‌పుట్ సాధనాల Chrome పొడిగింపు అనేది Chromeలో ఏ వెబ్ పేజీల్లో అయినా ఇన్‌పుట్ సాధనాలను ఉపయోగించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఇన్‌పుట్ సాధనాల Chrome పొడిగింపును ఉపయోగించడానికి, ఈ దశలను అనుసరించండి:

  1. Google ఇన్‌పుట్ సాధనాలను ఇన్‌స్టాల్ చేయండి
  2. పొడిగింపు చిహ్నం ను క్లిక్ చేసి, “పొడిగింపు ఎంపికల”ను ఎంచుకోండి
  3. "పొడిగింపు ఎంపికల" పేజీలో, మీకు నచ్చిన ఇన్‌పుట్ సాధనాన్ని ఎడమవైపు నుండి కుడివైపుకు ఎంచుకోండి.
  4. ఇన్‌పుట్ సాధనాన్ని జోడించడానికి ఎడమవైపున రెండుసార్లు క్లిక్ చేయండి. ఎంపికను తీసివేయడానికి కుడివైపున రెండుసార్లు క్లిక్ చేయండి.
  5. కుడివైపున ఇన్‌పుట్ సాధనంపై క్లిక్ చేసి, ఎగువకు బాణం మరియు దిగువకు బాణం చిహ్నాలపై క్లిక్ చేయడం ద్వారా ఎంచుకోబడిన ఇన్‌పుట్ సాధనాలను క్రమబద్ధీకరించండి.

ఇన్‌పుట్ సాధనాన్ని ఉపయోగించడానికి, పొడిగింపు చిహ్నంపై క్లిక్ చేయండి. కనిపించే డ్రాప్-డ్రౌన్ మెనులో, కావల్సిన ఇన్‌పుట్ సాధనాన్ని ఎంచుకోండి. ఇన్‌పుట్ సాధనం ప్రారంభించబడితే, పొడిగింపు బటన్ వలె రంగులతో కూడిన చిహ్నంగా మారుతుంది. ఇన్‌పుట్ సాధనం ఆపివేయబడినప్పుడు, బటన్ బూడిద రంగులోకి మారుతుంది. “ఆపివేయి” క్లిక్ చేస్తే, ఇన్‌పుట్ సాధనం ఆపివేయికి టోగుల్ అవుతుంది. మీరు ఎంచుకున్న ఇన్‌పుట్ సాధనాలపై క్లిక్ చేయడం ద్వారా కూడా వాటిని ప్రారంభించడం/ఆపివేయడం మధ్య టోగుల్ చేయవచ్చు.

ఇప్పుడు మీరు ఇన్‌పుట్ సాధనాన్ని ప్రారంభానికి టోగుల్ చేసారు, వెబ్ పేజీని తెరిచి, కర్సర్‌ను ఇన్‌పుట్ పెట్టె వద్దకు తరలించి ఆపై టైప్ చేయడాన్ని ప్రారంభించండి. ఇది పని చేయకపోతే, పై క్లిక్ చేయడం ద్వారా వెబ్ పేజీని రీఫ్రెష్ చేయండి.

ఒక్కో ఇన్‌పుట్ సాధనాన్ని ఉపయోగించడానికి సంబంధించిన కథనాలు: