చేతివ్రాత

చేతివ్రాత ఇన్‌పుట్ మౌస్ లేదా ట్రాక్‌ప్యాడ్‌తో నేరుగా పదాలను వ్రాయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. చేతివ్రాత 50 పైగా భాషలను మద్దతిస్తుంది.

చేతివ్రాత ఇన్‌పుట్‌ను ఉపయోగించడానికి, మొదటి దశగా ఇన్‌పుట్ సాధనాలను ప్రారంభించాలి. శోధన, Gmail, Google డిస్క్, Youtube, అనువాదం, Chrome మరియు Chrome OSలో ఇన్‌పుట్ సాధనాలను ప్రారంభించడానికి సూచనలను అనుసరించండి. ఎగువ ఉన్న ఉత్పత్తుల్లోని కొన్నింటిలో కొన్ని భాషలకు చేతివ్రాత ఇన్‌పుట్ అందుబాటులో ఉండకపోవచ్చని గమనించండి.

Google ఇన్‌పుట్ సాధానాల Chrome పొడిగింపులో చేతివ్రాత ఇన్‌పుట్‌ను ఎలా ఉపయోగించవచ్చనేదాన్ని తెలసుకోవడానికి ఈ ట్యుటోరియల్ వీడియోను చూడండి.

చేతివ్రాత ఇన్‌పుట్ పెన్సిల్ తో సూచించబడుతుంది.చేతివ్రాత ఇన్‌పుట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు, చేతివ్రాత ప్యానెల్‌కు మీ ట్రాక్‌ప్యాడ్/మౌస్‌ను తరలించండి. అక్షరాలను గీయడానికి ట్రాక్‌ప్యాడ్/మౌస్‌ను కిందికి నొక్కి ఉంచండి. మీ చేతివ్రాతకు సరిపోలే సూచిత పదం యొక్క అక్షరాలు ప్రదర్శించబడతాయి. అక్షరంపై క్లిక్ చేయడం ద్వారా సూచిత పదాన్ని ఎంచుకోండి లేదా మొదటి సూచిత పదాన్ని ఎంచుకోవడానికి ENTER లేదా SPACE కీని నొక్కండి.