వర్చువల్ కీబోర్డ్

వర్చువల్ కీబోర్డ్ లేదా "స్క్రీన్‌పై కనిపించే" కీబోర్డ్‌ని ఉపయోగించి మీరు ఎక్కడ ఉన్నా లేదా ఏ కంప్యూటర్‌ను ఉపయోగిస్తున్నా కూడా సులభంగా మరియు స్థిరంగా మీ స్థానిక భాష స్క్రిప్ట్‌లో నేరుగా టైప్ చేయవచ్చు. వర్చువల్ కీబోర్డ్‌ల యొక్క కొన్ని సాధారణ ఉపయోగాల్లో ఇవి ఉన్నాయి:

వర్చువల్ కీబోర్డ్‌లో 70 పైగా భాషల కోసం 100కి పైగా కీబోర్డ్‌లు ఉన్నాయి. వర్చువల్ కీబోర్డ్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి ఈ ట్యుటోరియల్ వీడియోను చూడండి. అలాగే దీన్ని ఆన్‌లైన్‌లో ప్రయత్నించండి.

వర్చువల్ కీబోర్డ్‌ని ఉపయోగించడానికి, మొదటి దశగా ఇన్‌పుట్ సాధనాలను ప్రారంభించాలి. శోధన, Gmail, Google డిస్క్, Youtube, అనువాదం, Chrome మరియు Chrome OSలో ఇన్‌పుట్ సాధనాలను ప్రారంభించడానికి సూచనలను అనుసరించండి.

వర్చువల్ కీబోర్డ్‌లు కీబోర్డ్ చిహ్నం తో సూచించబడతాయి. ప్రస్తుత IMEని ఆన్/ఆఫ్‌కు టోగుల్ చేయడానికి చిహ్నంపై క్లిక్ చేయండి లేదా మరో ఇన్‌పుట్ సాధనాన్ని ఎంచుకోవడానికి దాని పక్కన ఉన్న బాణంపై క్లిక్ చేయండి. వర్చువల్ కీబోర్డ్ సక్రియం అయినప్పుడు, బటన్ ముదురు బూడిద రంగులోకి మారుతుంది.

ఇది వర్చువల్ కీబోర్డ్ అయినప్పటికీ మీ స్వంత కీబోర్డ్‌పై టైప్ చేయడం ద్వారా లేదా వర్చువల్ కీబోర్డ్‌లోని కీలను నేరుగా మీ మౌస్‌తో క్లిక్ చేయడం ద్వారా వర్చువల్ కీబోర్డ్‌ను ఉపయోగించండి.

స్క్రీన్‌పై కనిపించే కీబోర్డ్‌ను కనిష్టీకరించడానికి, స్క్రీన్‌పై కనిపించే కీబోర్డ్ యొక్క ఎగువ కుడివైపు ఉన్న బాణంపై క్లిక్ చేయండి.