ఇన్‌పుట్ పద్ధతి (IME)

ఇన్‌పుట్ పద్ధతి ఎడిటర్‌లు (IMEలు) కీస్ట్రోక్‌లను మరో భాషలోని అక్షరాలుగా మారుస్తాయి. మేము అనేక IMEలను అందిస్తున్నాము. వాటిని ప్రయత్నించండి.

IMEని ఉపయోగించడానికి, మొదటి దశగా ఇన్‌పుట్ సాధనాలను ప్రారంభించాలి. శోధన, Gmail, Google డిస్క్, Youtube, అనువాదం, Chrome మరియు Chrome OSలో ఇన్‌పుట్ సాధనాలను ప్రారంభించడానికి సూచనలను అనుసరించండి.

IME అనేది భాషలో గా అక్షరం ద్వారా సూచించబడుతుంది.ప్రస్తుత IMEని ఆన్/ఆఫ్‌కు టోగుల్ చేయడానికి చిహ్నంపై క్లిక్ చేయండి లేదా మరో ఇన్‌పుట్ సాధనాన్ని ఎంచుకోవడానికి దీనికి పక్కన ఉన్న బాణంపై క్లిక్ చేయండి IMEని ఆన్‌కి టోగుల్ చేసినప్పుడు, బటన్ ముదురు బూడిద రంగులోకి మారుతుంది.

లాటిన్ IMEలు

యు.ఎస్ కీబోర్డ్‌ను ఉపయోగించి లాటిన్-స్క్రిప్ట్ భాషల్లో టైప్ చేసే వ్యక్తులకు సహాయపడటమే లాటిన్ IMEల యొక్క లక్ష్యం (ఉదా., ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్ మరియు డచ్). లక్షణాల్లో స్వయంచాలక విశేష చిహ్నాలు, అక్షరక్రమ తనిఖీ మరియు ఉపసర్గ పూరణ ఉన్నాయి.

లాటిన్ IMEలను ఉపయోగించడానికి, ఒత్తులు లేని అక్షరాలను టైప్ చేయండి ఆపై విశేష చిహ్నాలతో సరైన పదం సూచించబడుతుంది. ఉదాహరణకు, ఫ్రెంచ్‌లో, మీరు ‘franca’ అని టైప్ చేసినప్పుడు, మీకు ఉపసర్గ-పూరణ సూచిత పదం కనిపిస్తుంది.

సూచిత పదం “français”ని ఎంచుకోవడానికి TAB నొక్కండి. ఈ సమయంలో, మూల వచనం “franca”ని ఎంచుకోవడానికి SPACE/ENTER నొక్కండి.

“francais”ని విరామం లేకుండా టైప్ చేస్తున్నప్పుడు, స్టేజీలోని సూచిత పదం స్వీయ-విశేష చిహ్న సూచిత పదంగా మారుతుంది. సూచిత పదం “français”ని ఎంచుకోవడానికి SPACE/ENTER నొక్కండి.

మరిన్ని సూచిత పదాలను పొందడానికి, BACKSPACE నొక్కండి, అప్పుడు మీకు అన్ని సూచిత పదాలు కనిపిస్తాయి.

మొదటి సూచిత పదం అత్యంత-రహస్య స్వీయ విశేషక సూచిత పదం, ఇది స్వయంచాలకంగా హైలైట్ చేయబడుతుంది. రెండవ సూచిత పదం మూల వచనం. మూడవ మరియు నాలుగవ సూచిత పదాలు ఉపసర్గ-పూరణ సూచిత పదాలు. 5వ మరియు 6వ సూచిత పదాలు అక్షరక్రమ తనిఖీ సూచిత పదాలు.

బహుళ సూచిత పదాల నుండి పదాన్ని ఎంచుకోవడానికి, క్రింది చర్యల్లో దేన్నైనా చేయండి:

  • ప్రముఖంగా చూపబడిన సూచిత పదాన్ని ఎంచుకోవడానికి SPACE/ENTER నొక్కండి,
  • దానిపై క్లిక్ చేయండి,
  • పదం ప్రక్కన ఉన్న సంఖ్యను టైప్ చేయండి,
  • UP/DOWN కీలతో పేజీలో సూచిత పదాల జాబితాను నావిగేట్ చేయండి. UP/DOWN కీలతో పేజీలను తిప్పండి.